Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయం

Breaking : టాప్ 5, మనసాక్షి ఫ్లాష్ న్యూస్..!

మన సాక్షి బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తుంది. అందులో భాగంగా ముఖ్యమైన టాప్ 5 న్యూస్ ముఖ్యంశాలు.

Breaking : టాప్ 5, మనసాక్షి ఫ్లాష్ న్యూస్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

మన సాక్షి బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తుంది. అందులో భాగంగా ముఖ్యమైన టాప్ 5 న్యూస్ ముఖ్యంశాలు.

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ :

తెలంగాణ నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల శనివారం తెల్లవారుజామున శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. స్వామి వారి సేవలో మొక్కులు చెల్లించుకున్నారు. గవర్నర్ దంపతులకు శ్రీశైలం ఆలయ EO ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలోని కుంకుమార్చన పూజలో పాల్గొన్నారు. దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

పదవ తరగతి పరీక్షలు ప్రారంభం : 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అరగంట ముందుగానే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలకు అనుమతి ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అందుకుగాను 2676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన : 

హైదరాబాద్ లోనే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన జరిగింది. కుటుంబ కలహాల కారణంగా భార్యని క్షనికావేశంలో సుత్తితో తలపై కొట్టి చంపిన భర్త. పెయింట్ డబ్బా తలపై పడిందని డ్రామా ఆడి యశోద ఆసుపత్రికి తరలించిన భర్త. కూతుర్ల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన.

చిన్న తిరుపతిలో రాజస్థానీ బట్టి పోయిలు :

చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకాతిరుమలలో ఎల్పిజి గ్యాస్ కొరతతో ముందు జాగ్రత్తగా ఆలయ ఈవో రాజస్థానీ బట్టి పోయిలను తెప్పించారు. కమర్షియల్ సిలిండర్ల కొరతతో కట్టెల పోయిలు సిద్ధం చేసిన ఆలయ అధికారులు. భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు.

గాంధీ విగ్రహానికి కేవలం 70 కోట్లు : 

మహాత్మా గాంధీ విగ్రహానికి 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీ విగ్రహానికి కేవలం 70 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి ₹220 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మేము అడ్డు చెప్పలేదు కదా అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు