క్రైంBreaking Newsఆంధ్రప్రదేశ్
ఘోర ప్రమాదం.. బొలెరో బోల్తా పడి ఐదుగురు మృతి..!
ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో బోల్తా పడి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ఘోర ప్రమాదం.. బొలెరో బోల్తా పడి ఐదుగురు మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో బోల్తా పడి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతగిరి మండలం తుమ్మలవలస వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడటంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు విజయనగరం జిల్లా చింతాడ వాసులుగా తెలుస్తుంది. కూలీ పనుల కోసం అరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వార్తలు కూడా చదవండి :
- LPG GAS : గ్యాస్ బుకింగ్ సర్వర్ డౌన్.. హాస్టల్స్, హోటల్స్ లో తీవ్ర ఇబ్బందులు..!
- Madgulapally : పేకాట స్థావరాలపై దాడి.. ఇద్దరు పట్టుపడగా ఆరుగురు పరారు..!
- Viral : ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్య.. నవ్వుతూ వీడియో తీసిన సైకో భర్త.. (వీడియో వైరల్)
- TG : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్య.. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టిస్తే చర్యలు..!









