ప్రపంచంBreaking NewsTOP STORIES
ఇరాన్ యుద్ధం.. చైనాకు వెళ్లాల్సిన ట్యాంకర్ భారత్ కు..!
ఇరాన్ , ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో భారత్ కు గుడ్ న్యూస్ అందింది. చమరుతో రష్యా ట్యాంకర్ చైనాకు బయలుదేరింది.

ఇరాన్ యుద్ధం.. చైనాకు వెళ్లాల్సిన ట్యాంకర్ భారత్ కు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఇరాన్ , ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో భారత్ కు గుడ్ న్యూస్ అందింది. చమరుతో రష్యా ట్యాంకర్ చైనాకు బయలుదేరింది. కానీ దక్షిణ చైనా సముద్రంలో ఆ ట్యాంకర్ యూటర్న్ తీసుకుని భారత్ కు బయలుదేరింది. యుద్ధం నేపథ్యంలో మాస్కో నుంచి ఇండియా దిగుమతులు పెంచడంతో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. మార్చి 21వ తేదీన రష్యాకు చెందిన చమురు ట్యాంకర్ ఆక్వా టైటాన్ న్యూ మంగళూరు పోర్టుకు రానున్నది. ఈ భారీ నౌక చైనాలోని రిజ్జోవా పోర్టుకు వెళ్లాల్సి ఉంది. కానీ అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో రష్యా నుంచి భారత్ కొనుగోళ్లు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రష్యా ట్యాంకర్ భారత్ కు చేరనున్నది.









