తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nagarjuna Sagar : నాగార్జున సాగర్ సందర్శించిన మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్..!

అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను శనివారం నాడు మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దినేష్ వామరే కుటుంబ సమేతంగా సందర్శించారు.

Nagarjuna Sagar : నాగార్జున సాగర్ సందర్శించిన మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్..!

నాగార్జునసాగర్, మన సాక్షి :

అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను శనివారం నాడు మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దినేష్ వామరే కుటుంబ సమేతంగా సందర్శించారు. శుక్రవారం హైదరాబాదులో ఈవీఎంల తయారీ సంస్థ ఈసీఐఎల్ ఉన్నతాధికారులతో మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యదర్శి సురేష్ కాకాని తో కలిసి సమావేశమయ్యారు.

సాగర్ సందర్శనలో భాగంగా విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న వీరికి తిరుమలగిరి సాగర్ తాసిల్దార్ అనిల్ కుమార్,ప్రోటోకాల్ ఆర్ఐ దండ శ్రీనివాస్ రెడ్డి, విజయ విహార్ మేనేజర్ కిరణ్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వీరు టూరిజం లాంచీలో నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు. నాగార్జునకొండ పై పునర్ నిర్మించిన సింహల విహారము, అశ్వమేధ యజ్ఞశాల, మహాస్తూపాన్ని వీక్షించారు.

అనంతరం బుద్ధవనం చేరుకొని బుద్ధ పాదాల వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం వందనం సమర్పించారు. బుద్ధవనం సందర్శనలో భాగంగా బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్తూపవనాలను సందర్శించి మహాస్తూపం లోని సమావేశ మందిరంలో బుద్ధ వనం విశేషాలు తెలిపే లఘు చిత్రాన్ని వీక్షించారు.

అటుపిమ్మట మహాస్థూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులను వెలిగించారు. వీరికి బుద్దవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రులు బుద్ధవనం కండువాలతో, బ్రోచర్లతో సత్కరించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జున కొండ, బుద్ధవనం చారిత్రక విశేషాలను వివరించారు. వీరితోపాటు , ఈసీఐఎల్ సంస్థ ప్రతినిధి సౌరబ్, లైజనింగ్ ఆఫీసర్లు సుధీర్ రెడ్డి, పాండు, అభిషేక్,స్థానిక ఎస్సై ముత్తయ్య తదితరులు ఉన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు