Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

పంచాయతీకి దాతలు ఇచ్చిన స్థలం విక్రయం.. కార్యాలయానికి తాళం వేసి అర్ధ నగ్న నిరసన తెలిపిన ఉపసర్పంచ్..!

నల్గొండ జిల్లాలో ఓ గ్రామ పంచాయతీ కి దాతలు ఇచ్చిన స్థలాన్ని విక్రయించారని ఆరోపిస్తూ ఉప సర్పంచ్ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ఎర్రటి ఎండలో వర్ధన్ లగ్న నిరసన తెలిపిన సంఘటన జరిగింది.

పంచాయతీకి దాతలు ఇచ్చిన స్థలం విక్రయం.. కార్యాలయానికి తాళం వేసి అర్ధ నగ్న నిరసన తెలిపిన ఉపసర్పంచ్..!

శాలిగౌరారం, మనసాక్షి :

నల్గొండ జిల్లాలో ఓ గ్రామ పంచాయతీ కి దాతలు ఇచ్చిన స్థలాన్ని విక్రయించారని ఆరోపిస్తూ ఉప సర్పంచ్ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ఎర్రటి ఎండలో వర్ధన్ లగ్న నిరసన తెలిపిన సంఘటన సోమవారం జరిగింది. శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామనికి చెందిన వ్యక్తి యానాల సంజీవ రెడ్డి వారి తండ్రి (యానాల శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ ) జ్ఞాపకార్థం 5 గుంటల స్థలం గ్రామపంచాయతీ భవన నిర్మాణం నకు ఉచితంగా ఇవ్వడం జరిగింది.

అయితే అట్టి స్థలంను గ్రామం లోని సర్పంచ్ , భర్త, మరి కొంత మంది కలిసి వారికి నచ్చిన వారికి తక్కువ ధరకు ఎవరికీ తెలవకుండా విక్రయుంచారని ఉప సర్పంచ్ రాములు ఆరోపించారు. అట్టి డబ్బులతో వేరే దగ్గర స్థలం కొన్నట్టు తెలిసింది. అందుకు నిరసనగా ఊట్కూర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ రంగు రాములు  ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కి తాళం వేసి అర్ధ నగ్నంగా ఎండలో నిరసన తెలిపారు.

ఈ సందర్బంగా ఉపసర్పంచ్ రాములు మాట్లాడుతూ పంచాయతీకి చెందిన ఆస్తులను అమ్మేటప్పుడు గ్రామపంచాయతీ పాలక వర్గానికి, ఎంపీడీవో కి ఎంపీఓ కి తెలియపరచి కార్యదర్శి ద్వారా ప్రకటన ఇచ్చి తర్వాత అమ్మాల్సి ఉండగా ఏకపక్ష నిర్ణయంతో గ్రామపంచాయతీ ఆస్తులు అమ్మడం సరైన పద్ధతి కాదని, వెంటనే అధికారులు జోక్యం చేసుకొని ఆస్తులు అమ్మకాన్ని నిలిపివేయాలని కోరారు.

ఉపసర్పంచ్ నైనా తనకు కూడా సమాచారం ఇవ్వకపోవడం లో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొడ్డు సోమలింగయ్య యాదవ్,
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి కప్పల వెంకన్న యూత్ కాంగ్రెస్ నాయకులు వేముల సాయి, షఫీ , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దేవన బోయిన సైదులు, నాయకులు బొమ్మగాని బాలరాజ్ గౌడ్, రంగు గణేష్ శివ తదితరులు ఉన్నారు.

ఇవీ చదవండి:

మరిన్ని వార్తలు