Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
Sangareddy : అంగన్వాడీ టీచర్ ను చెట్టుకు బంధించి వేధింపులు..!
అంగన్వాడీ టీచర్ ను బలవంతంగా చెట్టుకు కట్టేసి వేధించిన ఐదుగురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దుర్గారెడ్డి బుధవారం తెలిపారు.

Sangareddy : అంగన్వాడీ టీచర్ ను చెట్టుకు బంధించి వేధింపులు..!
కంగ్టి, మన సాక్షి :
అంగన్వాడీ టీచర్ ను బలవంతంగా చెట్టుకు కట్టేసి వేధించిన ఐదుగురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దుర్గారెడ్డి బుధవారం తెలిపారు. కంగ్టి మండల రాసోల్ గ్రామంలో మంగళవారం విధులు నిర్వహిస్తున్న అంగన్వాడి టీచర్ వసంత కుమారిని, గ్రామానికి చెందిన అవుటి బండేప్ప, కోటగిరి రాములు, భూతాల వైద్యనాథ్,అవుటే సాయవ్వ, చాకలి బాలమణి,ఆమె వద్దకు వచ్చారు.
నీ భర్త ప్రభాకర్ గత కొన్నాళ్ల కిందట మావద్ద హెచ్బిఎన్ ఫైనల్స్ పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేశారని ఆగ్రహించారు. స్థానికంగా చెట్టుకు కట్టేసి, బూతు మాటలు తిడుతూ భయభ్రాంతులకు గురి చేశారని, వీరిపై తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితురాలు అంగన్వాడి టీచర్ వసంతకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.









