భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య.. ఊహించని ట్విస్ట్..!
భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య హతమార్చింది. ప్రియుడితో వివాహేతర సంబంధం కారణంగా సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా భర్త శవం వద్ద కన్నీరు కార్చింది. ఆమె యాక్టింగ్ కు అంత అయ్యో పాపం అనుకున్నారు.

భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య.. ఊహించని ట్విస్ట్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య హతమార్చింది. ప్రియుడితో వివాహేతర సంబంధం కారణంగా సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా భర్త శవం వద్ద కన్నీరు కార్చింది. ఆమె యాక్టింగ్ కు అంత అయ్యో పాపం అనుకున్నారు. కానీ పోలీసులు మాత్రం తెలివిగా కనిపెట్టారు.
ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందిన దేవకృష్ణ రోహిత్ (28) సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తాడు. అతనికి ప్రియాంక పురోహిత్ (25) తో కొంత కాలం కిందట పెళ్లయింది. కాగా ఈనెల 7వ తేదీన రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దుండగులు హఠాత్తుగా అతనిపై దాడి చేసి హత్య చేశారు. ఆ సందర్భంలో భార్య ప్రియాంక ఇంట్లో కట్టేసి కనిపించింది. ఏం జరిగిందని ఇరుగుపొరుగు, కుటుంబ సభ్యులు ఆరాతతయగా కొందరు దుండగులు అకస్మాత్తుగా వచ్చి దాడి చేసి భర్తను హత్య చేసినట్లుగా చెప్పింది. ఇంట్లో ఉన్నదంతా దోచేసి తన భర్తను అన్యాయంగా చంపేశారని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది.
అయితే ఆమె ఏడ్చే విధానం చూసి ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ పోలీసులు మాత్రం ఆమెను అనుమానించారు. దర్యాప్తు జరిపించారు. ప్రియాంకను పోలీసులు విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఆమె కాల్ డేటాను, మొబైల్ లొకేషన్ పరిశీలించిన పోలీసులు కమలేష్ పురోహిత్ అనే వ్యక్తితో ప్రియాంకకు అక్రమ సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు. ప్రియాంకను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా వివాహేతర సంబంధం కారణంగానే భర్తను హత్య చేయించినట్లుగా ఒప్పుకుంది.
తన భర్త దేవకృష్ణ నల్లగా ఉండటం ఆమెకు నచ్చలేదని తెలిపింది. తరచుగా భర్తను అవమానించేదని పోలీసుల విచారణలో తేలింది. తన భర్త నల్లగా ఉన్నాడని తన స్థాయికి సరిపోడని, కమలేష్ అనే వ్యక్తితో ఉన్న క్రమ సంబంధం బయట పాడటంతో అడ్డు తొలగించుకోవాలని భర్తను హతమార్చినట్లు గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు.









