Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Breaking : సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు..!
సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కోదాడ బైపాస్ వద్ద 65వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి ప్రైవేట్ బస్సు బలంగా ఢీ కొట్టింది.

Breaking : సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు..!
మన సాక్షి, సూర్యాపేట :
సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కోదాడ బైపాస్ వద్ద 65వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి ప్రైవేట్ బస్సు బలంగా ఢీ కొట్టింది. హైదరాబాదు నుండి ఏలూరు వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి బలంగా డీకొట్టింది. బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా 16 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో బస్సు మెయిన్ డోర్ ఓపెన్ కాకపోవడంతో ప్రయాణికులు ఎమర్జెన్సీ ద్వారా బయటపడ్డారు. డ్రైవర్ నిద్ర మత్తు ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.









