కస్తూర్బా కాలేజీలో ఎం పి హెచ్ డబ్ల్యు మొదటి సంవత్సరంలో 100% ఉత్తీర్ణత..!
నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా జూనియర్ కాలేజీలో ఆదివారం వెలువడిన ఇంటర్ పరీక్షా ఫలితాలలో ఎం పి హెచ్ డబ్ల్యు మొదటి సంవత్సరంలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు ఆ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ వాసవి పేర్కొన్నారు.

కస్తూర్బా కాలేజీలో ఎం పి హెచ్ డబ్ల్యు మొదటి సంవత్సరంలో 100% ఉత్తీర్ణత..!
చింతపల్లి, మన సాక్షి :
నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా జూనియర్ కాలేజీలో ఆదివారం వెలువడిన ఇంటర్ పరీక్షా ఫలితాలలో ఎం పి హెచ్ డబ్ల్యు మొదటి సంవత్సరంలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు ఆ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ వాసవి పేర్కొన్నారు.. మొదటి సంవత్సరం పదిమంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, పదిమంది విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి 100% ఉత్తీర్ణత కనబరిచారు.
ఈ సందర్భంగా ఎస్.కె, సమీరా 500 మార్కులకు గాను 486 అత్యధిక మార్కులు సాధించినట్లు ఆ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ వాసవి తెలిపారు. ఈ సందర్భంగా మొదటి సంవత్సరంలోనే ఎం పి హెచ్ డబ్ల్యు నుండి 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులనుఆమె అభినందించారు.
అదేవిధంగా ఉత్తమ సాధించిన ఎస్. కే సమీరాను, చింతపల్లి మండల విద్యాశాఖ అధికారి నీరుడు అంజయ్య, స్థానిక సర్పంచ్ కా సారం శ్వేతా శ్రీనివాసులు, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, పాఠశాల అధ్యాపక బృందం, ఉత్తమ ర్యాంకు సాధించిన ఎస్.కె సమీరాను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.









