Breaking : హైదరాబాద్ – నాగార్జునసాగర్ హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి..!
నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని పోలేపల్లి రాంనగర్ గేట్ సమీపంలో హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు లారీని ఢీ కొట్టిన సంఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి.

Breaking : హైదరాబాద్ – నాగార్జునసాగర్ హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి..!
చింతపల్లి, మన సాక్షి :
నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని పోలేపల్లి రాంనగర్ గేట్ సమీపంలో హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు లారీని ఢీ కొట్టిన సంఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
స్థానికులు తెలిపిన వివరణ ప్రకారం.. మల్లేపల్లి నుండి హైదరాబాద్ వైపు టీఎస్ 06 ఎఫ్ సి 17 28 నెంబర్ గల కారులో ఇరువురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో .హైదరాబాదు నుండి మల్లేపల్లి వైపు వెళ్తున్న టి ఎన్ 04 ఏ ఆర్ 23 72 లారీని ఎదురుగా వస్తున్న లారీని చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గేట్ సమీపంలో కారు లారీని బలంగా ఢీకొనడంతో కార్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెంది కారులోనే ఇరుక్కుపోయాడు.
మరో వ్యక్తికి గాయాలు కావడంతో మాల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద సంఘటన విషయం తెలుసుకున్న చింతపల్లి ఎస్సై ముత్యాల రామ్మూర్తి హటావుటిన ప్రమాద స్థలికి చేరుకుని కారులో ఇరికిపోయి ఉన్న బయటకు తీశారు.మృతుని వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.