Karimnagar : రాహుల్ గాంధీ స్థానం కోసం రేవంత్ రెడ్డి తాపత్రయం..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్థానాన్ని ఆక్రమించాలని తాపత్రయపడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. మంగళవారం కరీంనగర్ 20వ డివిజన్ రేకుర్తి లోని పెంటకమ్మ చెరువు సుందరికరణ పనులకు ఆయన భూమి పూజ చేశారు.

Karimnagar : రాహుల్ గాంధీ స్థానం కోసం రేవంత్ రెడ్డి తాపత్రయం..!
-
దక్షిణాదికి అన్యాయమంటూ గగ్గోలు వెనుక అసలు కుట్ర ఇదే
-
జమిలి ఎన్నికలొస్తే బీజేపీ గెలుస్తుందనే భయం రేవంత్ కు పట్టుకుంది
-
రాహుల్ గాంధీని జనం విశ్వసించడం లేదు
-
డీలిమిటేషన్ బిల్లును అడ్డుకుని దక్షిణాదికి అన్యాయం చేసింది రేవంత్, స్టాలినే
-
రేవంత్ రెడ్డి, స్టాలిన్ లపై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, మనసాక్షి :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్థానాన్ని ఆక్రమించాలని తాపత్రయపడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. మంగళవారం కరీంనగర్ 20వ డివిజన్ రేకుర్తి లోని పెంటకమ్మ చెరువు సుందరికరణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. అమృత్ 2 పథకంలో భాగంగా కోటి 80 లక్షల రూపాయల నిధులతో చెరువుల్లోకి మురుగు నీరు వెళ్లకుండా, నగర ప్రజలు సేద తిరేలా మినీ పర్యాటక ప్రాంతంగా మారుస్తామన్నారు.
కరీంనగర్ పరిధిలో మెయిన్ రోడ్ల నిర్మాణం పూర్తయ్యిందని, ఇకపై గల్లీలో గుంతలు పడ్డ రోడ్లపై దృష్టి సారించి నూతన రోడ్లను నిర్మిస్తామని వెల్లడించారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, స్టాలిన్ లపై మండిపడ్డారు. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెడుతున్నారని, జమిలి ఎన్నికలొస్తే తెలంగాణలోనూ బీజేపీ విజయం తథ్యమని రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు.
ప్రజలంతా రేవంత్ ను చీదరించుకుంటున్నారనే సంగతి మర్చిపోయారన్నారు. కనీసం ఇంటెలిజెన్స్ నుండి సమాచారం తెప్పించుకుంటే బాగుండేదని, ఇవేవీ లేకుండా రాహుల్ గాంధీ స్థానంలో రేవంత్ రెడ్డి కూర్చోవాలని తాపత్రయపడుతున్నారన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీని ప్రజలు లీడర్ గా అంగీకరించడం లేదన్నారు. మహిళా బిల్లును అడ్డుకుని రేవంత్ రెడ్డి, స్టాలిన్ సహా విపక్షాలు చాలా పెద్ద తప్పు చేశాయన్నారు.
కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే, ఎన్సీపీ పార్టీల ద్రుష్టిలో మహిళలంటే సోనియా, ప్రియాంకగాంధీ, డింపుల్ యాదవ్, కనిమొళి, సుప్రియా సూలే మాత్రమేనని విమర్శించారు. వాళ్లకు పదవులు, సీట్లు ఇస్తే మహిళలందరికీ న్యాయం జరిగినట్లేనని అనుకుంటున్నారన్నారు. అందుకే సాధారణ మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తానంటే అడ్డుకోవడం లేదన్నారు. సాధారణ మహిళలకు చట్టసభల్లోకి వస్తే… వారసత్వ కుటుంబ పార్టీల పునాదులు కదిలి పోతాయనే భయం పట్టుకుందన్నారు.
అందుకే అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు. దేశంలో 52 కోట్ల జనాభా ఉన్నప్పుడు 543 పార్లమెంట్ సీట్లు ఉండాలని నిర్ణయించారని, నేటికీ అదే కొనసాగుతోందన్నారు. దేశ జనాబా 140 కోట్లు దాటిన నేపథ్యంలో ఎంపీ సీట్ల సంఖ్యను 816 ఎంపీ సీట్లు చేయాలని మోదీ నిర్ణయించారన్నారు. జనాభా లెక్కలతో సీట్లు కేటాయిస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని మోదీ గ్రహించి ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచి ఏ రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని బిల్లును పెట్టారన్నారు.
దీంతోపాటు అస్తవ్యస్తంగా ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు క్రమబద్దీకరించాలని నిర్ణయించి పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లు పెడితే… అడ్డుకుని రేవంత్, స్టాలిన్ సహా కుటుంబ పార్టీలు దక్షిణాదికి తీరని అన్యాయం చేశారన్నారు. పార్లమెంట్ లో గంట సేపు సమయమిస్తే… ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచుతూ డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెడతామని అమిత్ షా చెప్పారన్నారు. తద్వారా దక్షిణాదికి న్యాయం చేస్తామని చెబితే… అడ్డుకున్నది ఎవరు కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, టీఎంసీ, ఎన్సీపీ పార్టీలే కదా అని ప్రశ్నించారు.










