Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

Big Breaking : కాలేశ్వరం తీర్పుపై తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం..!

కాలేశ్వరం ఎత్తిపోతల పథకం పై గతంలో వెలువడిన తీర్పులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

Big Breaking : కాలేశ్వరం తీర్పుపై తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

రాష్ట్ర రాజకీయాలలో సంచలనం రేపిన కాలేశ్వరం ప్రాజెక్టు కేసు విషయంలో హైకోర్టు ఊహించని తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టు తీర్పు ఊరట కలిగించింది. గోష్ కమిషన్ నివేదిక ఆధారంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు తీర్పు ఇచ్చింది.

కాగా కాలేశ్వరం ఎత్తిపోతల పథకం పై గతంలో వెలువడిన తీర్పులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, న్యాయపరమైన అంశాలను అత్యున్నత న్యాయస్థానంలో బలంగా వినిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనునట్లు తెలుస్తుంది. ప్రాజెక్టు రీడిజైనింగ్, ఖర్చు, పర్యావరణ అనుమతుల విషయంలో ఎదురవుతున్న చిక్కులను తొలగించుకోవడమే లక్ష్యంగా ఈ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు