Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మోసం.. బాధితుల ఆందోళన..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకుడు భారీ మోసానికి పాల్పడ్డాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

Miryalaguda : యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మోసం.. బాధితుల ఆందోళన..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకుడు భారీ మోసానికి పాల్పడ్డాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన రాంనగర్ బంధం నివాసి మిడసన మెట్ల రవి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో AE పోస్టులు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడ్డాడని బాధిత మహిళ చక్రహరి ఒకలాదేవి పేర్కొన్నారు. ఆమె విలేకరుల సమావేశంలో ప్లకార్డులతో నిరసన తెలుపుతూ మాట్లాడారు.

అతను ఒక పేపర్ టౌన్ రిపోర్టర్ గా పనిచేస్తున్నానని తన పేపర్ కి వైటిపిఎల్ లో నాలుగు ఏఈ పోస్టులు ఇస్తారని అమాయకులను నమ్మించి ఒక్కొక్కరి నుండి సుమారు 5 లక్షల రూపాయలు వసూలు చేశారని చెప్పింది. తనతో పాటు పద్మప్రియ ఆటో ఫైనాన్స్ దాంట్లో రికవరీ ఏజెంట్ గా ఉన్నటువంటి మిడసనమెట్ల రవి.. నీ కొడుకుది బీటెక్ పూర్తయింది కదా వైటీపీఎల్లో మీ కొడుక్కి ఏఈ పోస్టు ఇప్పిస్తానంటూ నమ్మించి నాలుగు లక్షల 75 వేల రూపాయలు నగదు రూపంలో తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. పలుమార్లు జాబు విషయంలో ఫోన్లో జరిపిన సంభాషణను విలేకరుల సమావేశంలో వినిపించడం జరిగింది..

అతి త్వరలోనే జీవో కాపీలు రిజిస్టర్ పోస్టులు వస్తాయని.. తొందరపడితే వచ్చే పోస్టులు రావని కాలయాపన చేస్తూ వచ్చాడు. మోసపోయామని గ్రహించిన బాధిత మహిళ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. తన లాగా ఎవరు మోసపోకుండా ఉండాలని ఉద్దేశంతోనే అతని పూర్తి వివరాలను మీడియా వారికి తెలియజేశారని చెప్పారు. పోలీస్ శాఖ వారు విచారణ జరిపి ఎవరెవరి దగ్గర ఎన్ని లక్షలు వసూలు చేశాడు. ఈ పోస్టులు ఇప్పించేది ఎవరు? వారికి ఎంతెంత ముట్ట చెప్పారు. దీని వెనక ఉన్న బడా బాబులు ఎవరు? ఎన్నేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నారు..? ఇలాంటి విషయాలను లోతుగా విచారణ చేపట్టి కఠినంగా శిక్షించాలని కోరారు.

మరిన్ని వార్తలు