Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంతెలంగాణ

IAS Transfers : తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..!

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ కుమార్ ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించింది.

IAS Transfers : తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ కుమార్ ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించింది. అదేవిధంగా ప్రస్తుతం కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న దాన కిషోర్ ను పంచాయతీరాజ్ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దాంతో పాటు ఏడు జిల్లాలకు కొత్త కలెక్టర్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఆరుగురు ఐఏఎస్ జోనల్ కమిషనర్లను నియమించింది. ఈ మేరకు సి.ఎస్ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు

మరిన్ని వార్తలు