Penpahad : వైద్యం వికటించి మహిళ మృతి..!
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని న్యూ బంజర హిల్స్ తాండ లో ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించి మహిళ మృతి చెందిన సంఘటన జరిగినది పెన్ పహాడ్ యస్ ఐ కస్తాల గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.

Penpahad : వైద్యం వికటించి మహిళ మృతి..!
పెన్ పహాడ్, మన సాక్షి:
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని న్యూ బంజర హిల్స్ తాండ లో ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించి మహిళ మృతి చెందిన సంఘటన జరిగినది పెన్ పహాడ్ యస్ ఐ కస్తాల గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.
న్యూ బంజార హిల్స్ తండ గ్రామానికి చెందిన ధరావత్ కాశి భర్త సైదా వయస్సు.40సం. గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్నది అట్టి ఆరోగ్యాన్ని మందులతో బాగు చేస్తా అని అదే తండ కు చెందిన ఆర్ ఎం పి డాక్టర్ ధరావత్ నాగేందర్ మందులు ఇవ్వగా అట్టి మందులు వాడిన తర్వాత అనారోగ్యం తీవ్రం కాగా తేదీ.25.04.2026 రోజున ఖమ్మం లో న్యూ ఆరోగ్య హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతూ తేదీ 06.05.2026 రోజున మరణించింది.
ధరావత్ నాగేందర్ ఇచ్చిన మందుల వలన తీవ్ర అనారోగ్యం గురై మరణించింది అని మృతురాలి కొడుకు అయిన ధరావత్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు ఎస్ ఐ కస్తాల గోపి కృష్ణ కేసు నమోదుచేసి విచారణ చేసినారు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- లారీ బీభత్సం.. గాలిలో ఎగిరిన విద్యుత్ స్తంభాలు, నేలమట్టమైన ట్రాన్స్ఫార్మర్లు..!
- జీర్ణకోశ ఆరోగ్యానికి కొత్త అర్థం.. ‘ప్రాజెక్ట్ సెరోటోనిన్’ ప్రిసిషన్ గట్ హెల్త్ ప్రోటోకాల్ ప్రారంభం!
- Miryalaguda : మిర్యాలగూడలో విద్యార్థులకు ఎమ్మెల్యే బిఎల్ఆర్ భరోసా..!
- Miryalaguda : పేకాట స్థావరంపై దాడి.. ఇద్దరు అరెస్టు..!









