Karimnagar : ఆపరేషన్ వికటించి మహిళ మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని మంకమ్మ తోట ఏరియాలోని ఓ ప్రైవేట్ హస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యనికి ఓ నిండు ప్రాణం గాల్లో కలిసింది.

Karimnagar : ఆపరేషన్ వికటించి మహిళ మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని మంకమ్మ తోట ఏరియాలోని ఓ ప్రైవేట్ హస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యనికి ఓ నిండు ప్రాణం గాల్లో కలిసింది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ మేదరి వాడకు చెందిన బేధరకోట చంద్రకళ 45 భర్త సంతోష్ కడుపు నొప్పితో బాధ పాడుతూ వైద్యం కోసం నగరంలోని యశోద కృష్ణా హాస్పిటల్లో గురువారం చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గర్భ సంచిలో గడ్డలు ఉన్నాయని నిర్దారించారు.
పేషంట్ కు గడ్డలు తొలగించాలంటే సర్జరీ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. వైద్యల సూచన మేరకు పేషంట్ కుటుంబ సభ్యులు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వెంటనే అదే రోజు గురువారం వైద్యులు పేషంట్ కి సర్జరీ చేశారు.
శుక్రవారం ఐ.సి.యు లో నుంచి జనరల్ వార్డులోకి పేషంట్ ను మెట్ల పై నుంచి నడిపిస్తూ పైన అంతస్తుకు చేర్చే క్రమంలో పేషంట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆపరేషన్ సమయంలో కరెంట్ కూడా పోయిందని, హాస్పిటల్లో ఆక్సీజన్ కూడా అందుబాటులో లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా వైద్యులు కూడా ఆ సమయంలో లేరని మొత్తం హిస్పిటల్లో ఉన్న నర్సులు, సిబ్బందే అత్యుత్సాహం ప్రదర్శించి నిర్లక్ష్యంతో చంద్రకళ ప్రాణం తీసారని ఆరోపించారు.
ఇక చంద్రకళ కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట బైటయించి తమకు న్యాయం చేయాలనీ ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని, హాస్పిటల్ పర్మిషన్ ను రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.









