Karimnagar : మద్యం మత్తులో తండ్రిని చంపిన తనయుడు..!
మద్యం మత్తులో కన్నతండ్రినే అతి కిరాతకంగా కొడుకు హత్య చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నగరంలోని కాశ్మిర్ గడ్డకు చెందిన ఆరెల్లి నర్సయ్య (55) శుక్రవారం మధ్యం సేవించి ఇంటికి వచ్చాడు.

Karimnagar : మద్యం మత్తులో తండ్రిని చంపిన తనయుడు..!
కరీంనగర్, మనసాక్షి :
మద్యం మత్తులో కన్నతండ్రినే అతి కిరాతకంగా కొడుకు హత్య చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నగరంలోని కాశ్మిర్ గడ్డకు చెందిన ఆరెల్లి నర్సయ్య (55) శుక్రవారం మధ్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న తన భార్యతో గొడవ దిగాడు.. చిన్నగా మొదలైన గొడవ కాస్త దాడికి దారితీసింది. ఇంట్లో మధ్యం మత్తులో ఉన్న కుమారుడు మల్లేష్ (21) కల్లేదుటే తన తల్లిని కొడుతుంటే చూసి జిర్ణించుకోలేక క్షనికవేశంలో ఇంట్లో ఉన్న గొడ్డలితో విచక్షణారహితంగా తండ్రిపై దాడి చేశాడు.
దింతో తీవ్ర గాయాలైన నర్సయ్య రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చిన్న కుమారుడు ఆరెల్లి రమేష్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న టు టౌన్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించి, పోస్టుమార్టం నిమిప్తం మృతదేహన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నర్సయ్య స్వగ్రామం ఎండపెల్లి మండలం అంబారిపేట గ్రామం కాగా జీవనోపాదికోసం కరీంనగర్ లోని కాశ్మిర్ గడ్డలో అద్దె ఇంట్లో భార్య, ఇద్దరు కుమారులతో నివాసం ఉంటున్నాడు.
నర్సయ్య నూతనంగా నిర్మిస్తున్న ఓ అపార్ట్మెంట్ లో వాచ్మాన్ గా పని చేస్తు జీవనం కొనసాగించేవాడు. కుమారుడు మల్లేష్ ఓ మెడికల్ ఏఝన్సీలో పనిచేస్తుంటాడని స్థానికులు తెలిపారు. తండ్రిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్యకు సంబందించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.









