Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : బోరు గుంతలో నాలుగేళ్ల మనవడు.. కాపాడబోయి తాత మృతి..!

నల్గొండ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల మనవడిని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించిన తాత ఊపిరి వదిలాడు.

Miryalaguda : బోరు గుంతలో నాలుగేళ్ల మనవడు.. కాపాడబోయి తాత మృతి..!

మన సాక్షి, మిర్యాలగూడ :

నల్గొండ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల మనవడిని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించిన తాత ఊపిరి వదిలాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఊట్లపల్లి గ్రామ శివారులో వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు బోరు గుంతలో నాలుగేళ్ల బాలుడు పడిపోయాడు. బాలుడిని కాపాడేందుకు తాత వెంకన్న (56) ( ఉప సర్పంచ్ ) ఎలాంటి ఆలోచన చేయకుండా తన మనవడు తనకు కావాలని బోరు గుంతలోకి దిగాడు.

మనవడిని కాపాడబోయి తాత బోరు గుంతలో ఇరుక్కున్నాడు. రూరల్ పోలీసులు వెంటనే స్పందించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. బోరు గుంతలోంచి తాత, మనవడిని బయటకు తీయగా తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్నను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తన మనవడి కోసం ప్రాణాలు వదిలిన తాత మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు