AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి..!
వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మదనపల్లె పట్టణానికి చెందిన మయూరి రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు.

AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి..!
మదనపల్లె,, మన సాక్షి :
వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మదనపల్లె పట్టణానికి చెందిన మయూరి రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. అయన మాట్లాడుతూ తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించడం ఆనందంగా ఉందన్నారు.
రాష్ట్రస్థాయి పదవి కేటాయించిన వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మదనపల్లి వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్, పీలేరు నియోజకవర్గం ఇంచార్జ్ చింతల రామచంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఇతర పార్టీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని, త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికలు, 2029 శాసనసభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన సంకల్పమని వెల్లడించారు. వైకాపా మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన మయూరి రఘునాథరెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.









