Breaking Newsజిల్లా వార్తలువిద్యసంగారెడ్డి జిల్లా
ట్రిపుల్ ఐటీకి 12 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఎంపిక..!
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని తడ్కల్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 12 విద్యార్థులు త్రిబుల్ ఐటీకి ఎంపికైనట్లు ఎంఈవో రహీమొద్దీన్ తెలిపారు.

ట్రిపుల్ ఐటీకి 12 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఎంపిక..!
కంగ్టి, మనసాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని తడ్కల్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 12 విద్యార్థులు త్రిబుల్ ఐటీకి ఎంపికైనట్లు ఎంఈవో రహీమొద్దీన్ తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగానే ప్రతిభ చాటారన్నారు. విద్యార్థుల నిరంతర కృషి, క్రమశిక్షణే ఈ విజయానికి కారణమన్నారు. ఎంపికైన శ్రేయ, సంజన, రాహుల్ గిరి, నిహారిక, ప్రవళిక, భవాని, లాల్ చంద్, రాగిణి, ఆలేఖ్య, వివేక్, గణేష్, విక్రమ్ విద్యార్థులను ఎంఈవో, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు అంజన, సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.









