Cyber Crime : సైబర్ మోసగాళ్ల బారిన పడిన యువకుడు.. బ్యాంకు ఖాతా ఖాళీ చేసిన మోసగాళ్లు..!
ఆన్లైన్లో వచ్చిన ఓ మెసేజ్ క్లిక్ చేయడం వల్ల ఓ వ్యక్తి సైబర్ మోసగాళ్ల బారిన పడి రూ.95 వేల రూపాయలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Cyber Crime : సైబర్ మోసగాళ్ల బారిన పడిన యువకుడు.. బ్యాంకు ఖాతా ఖాళీ చేసిన మోసగాళ్లు..!
బీర్కూర్ (మన సాక్షి )
ఆన్లైన్లో వచ్చిన ఓ మెసేజ్ క్లిక్ చేయడం వల్ల ఓ వ్యక్తి సైబర్ మోసగాళ్ల బారిన పడి రూ.95 వేల రూపాయలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే, బీర్కూర్ మండలంకు చెందిన షేఖ్ మజర్ అనే బాధితుడికు తన మొబైల్ ఫోన్‌కు ఓ ఆకర్షణీయమైన సందేశం వచ్చింది. అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేసిన అనంతరం అతని బ్యాంకు ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చేరాయి. కొద్దిసేపటికే అతని ఖాతా నుంచి విడతల వారీగా మొత్తం రూ.95 వేల రూపాయలు డెబిట్ అయినట్లు గుర్తించాడు.
దీంతో బాధితుడు వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించి, సైబర్ క్రైమ్ బీర్కూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు . ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, గుర్తు తెలియని సైబర్ మోసగాళ్ల కోసం గాలిస్తున్నారు. నేరస్తులను తొందరగా పట్టుకోవాలని బాధితుడు షేక్ మజర్ అతని కుటుంబ సభ్యులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.