BREAKING : విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం.. 8 మంది కార్మికులు సజీవ దహనం..!
విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం సంభవించింది. ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. స్టీల్ ప్లాంట్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.

BREAKING : విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం.. 8 మంది కార్మికులు సజీవ దహనం..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం సంభవించింది. ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. స్టీల్ ప్లాంట్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు.
సి సి డి విభాగంలోని లిక్విడ్ స్టీల్ నిర్వహణలో ప్రమాదం జరిగింది. హాట్ మెటల్ బకెట్ కుప్పకూలింది. దాంతో కార్మికులపై ద్రవ ఉక్కు పడింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మృతి చెందిన కార్మికులలో అప్పారావు, ప్రభాకర్ రావు, కృష్ణ, రమణ, భాను కుమార్, త్రినాథ్, అప్పలరాజు, కుమార్ ఉన్నారు. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంపై తీవ్ర దిబ్బంతిని వ్యక్తం చేశాడు. ప్రమాద సంఘటనపై ఆరా తీశారు. స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడారు. కార్మికులు చనిపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించారు.









