Nalgonda : ఎన్నికల మనోఫెస్టో అమలు చేయాలి.. సి పి ఐ ధర్నా..!
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నిటిని అమలు చేయాలని అనేక డిమాండ్స్ పై నల్లగొండ గడియారం సెంటర్ లో ధర్నా నిర్వహించడం జరిగినది .

Nalgonda : ఎన్నికల మనోఫెస్టో అమలు చేయాలి.. సి పి ఐ ధర్నా..!
నల్గొండ ప్రతినిధి, మన సాక్షి,
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీద పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యవసర వస్తువుల సరుకుల ధరల పెరుగుదల, అడుగుపిండి పెరుగుదల, యూరియా యాప్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నిటిని అమలు చేయాలని అనేక డిమాండ్స్ పై నల్లగొండ గడియారం సెంటర్ లో ధర్నా నిర్వహించడం జరిగినది .
ఈ ధర్నాలో సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీనియర్ పార్టీ నాయకులు మల్లెపల్లి ఆది రెడ్డి, మాజీ శాసనసభ్యులు యాదగిరి రావు, సహాయ కార్యదర్శిలు పల్లా దేవేందర్ రెడ్డి, లొడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, పబ్బు వీరస్వామి, గురజా రామచంద్రం, బుచ్చిరెడ్డి, అంజాచారి, టి వెంకటేశ్వర్లు, బొలుగూరి నరసింహ, రామలింగయ్య, ప్రజానాట్యమండలి కళాకారులు జగన్, పాండురంగారావు, జిల్లా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










