Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబాబాద్ జిల్లా

ACB : రూ. 45 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో, ఎంపీఓ..!

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రాధిక, మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) కిన్నెర యాకయ్యతో పాటు ఎంపీడీవో కుమారుడు రాంప్రసాద్ ఏసీబీకి చిక్కినట్లు సమాచారం.

ACB : రూ. 45 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో, ఎంపీఓ..!

మహబూబాబాద్, మన సాక్షి

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రాధిక, మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) కిన్నెర యాకయ్యతో పాటు ఎంపీడీవో కుమారుడు రాంప్రసాద్ ఏసీబీకి చిక్కినట్లు సమాచారం.

పడమటి గూడెం గ్రామంలోని ఓ వెంచర్‌కు అనుమతులు మంజూరు చేయడానికి రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో మొదటి విడతగా రూ.45 వేల నగదును స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది.

ఎంపీడీవో కార్యాలయంలో పలు పరిపాలనా వ్యవహారాలను అనధికారికంగా చక్కబెడుతూ వచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీడీవో కుమారుడు రాంప్రసాద్ కూడా ఈ కేసులో ఏసీబీ అధికారుల విచారణలో ఉన్నట్లు సమాచారం.

దాడుల అనంతరం ఏసీబీ అధికారులు కార్యాలయంలోని పలు పత్రాలను స్వాధీనం చేసుకుని, సంబంధిత అధికారులను విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ప్రకటన అనంతరం వెల్లడికానున్నాయి. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఏసీబీ చర్యలను ప్రజలు స్వాగతిస్తున్నారు.

మరిన్ని వార్తలు