Miryalaguda : రైతులకు దారుణంగా వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం..!
దేశానికి వెన్నుముకగా నిలిచిన తెలంగాణ రైతులకు దారుణంగా వెన్నుపోటు పొడిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి అన్నారు.

Miryalaguda : రైతులకు దారుణంగా వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
దేశానికి వెన్నుముకగా నిలిచిన తెలంగాణ రైతులకు దారుణంగా వెన్నుపోటు పొడిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి అన్నారు. శనివారం మిర్యాలగూడ లోని బి ఆర్ ఎస్ కార్యాలయం లో విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని ఇప్పటికే సంక్షోబంలోకి నెట్టి రైతు బతుకును చిద్రం చేశారు. సిఎం రేవంత్, పదేళ్ళపాటు ధీమాగా , ధైర్యంగా బతికిన రైతును మల్లి సమైఖ్య రాష్ట్రం నాటి కష్టాలలోకి నెట్టారు.. పక్కనే గోదావరి కృష్ణ పారుతున్న సాగునీటి వసతు లేదు కరెంటుకు దిక్కులేదు కాలిపోయే మోటర్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లతో తల్లడిల్లిన రోజు లేదు 60 ఏళ్లు తెలంగాణలో వ్యవసాయం కన్నీటి సేద్యంగానే సాగిందన్నారు.
కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమానికి పునాది కూడా రైతుల కష్టాలు కన్నీళ్లే మిషన్ కాకతీయ ద్వారా 45 వేల చెరువుల పూడిక తీసి భూగర్భ జలాలను పెంచారు కాలేశ్వరం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించారు. రైతుల ఖాతాల్లో నేరుగా 11 విడతల్లో 72,000 కోట్లు జమ చేసి దేశంలోనే చరిత్ర సృష్టించారు రైతు కుటుంబానికి ఏమైనా జరిగితే రోడ్డున పడకూడదని ఐదు లక్షల రైతు బీమాను అమలు చేశారు. రైతుబంధుకు 72,000 కోట్లే కాకుండా రైతు రుణమాఫీకి 29 వేల కోట్లు రైతు బీమాకు 6800 కోట్లు చెల్లించారు..
రైతుబందు మాజీ అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. స్వతంత్ర భారతావనిలో తొలిసారి రైతులకు 24 గంటల ఉచిత కరెంటును అందించి చరిత్ర సృష్టించారు అది 2014కు ముందు వానాకాలం యాసంగి రెండు పంటలు విస్తీర్ణం కోటి 31 లక్షల ఎకరాలు అది 2023 నాటికి రెండు కోట్ల 30 లక్షల ఎకరాలకు చేరింది కరోనా కష్టకాలంలో 7వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు కల్లాల వద్దే ప్రతి పంటను చివరి గింజ వరకు కొని రైతుకి కొండంతా అండగా నిలిచారు.
కేసీఆర్ మద్దతు ధరకు కేవలం వరి ధాన్యమే కాకుండా మొక్కజొన్న జొన్న శనగ కందులు పెసలు సన్ఫ్లవర్ సోయాబీన కూడా కొనుగోలు చేసింది నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఇలా పదేళ్లపాటు పండుగల మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండుగలా మార్చే కుట్ర చేస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి రైతుబంధులు 15 వేలకు పెంచుతానని చివరికి మూడుసార్లు ఎగ్గొట్టి మోసం చేశాడు. 24 గంటలు ఉచిత విద్యుత్ కు ఉరివేయడానికి రైతు డిస్కౌంట్ తెరపైకి తెచ్చాడు చివరికి రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ఆత్మహత్య చేసుకునే దుస్థితి తెచ్చాడు.
నల్లమోతు సిద్ధార్థ మాట్లాడుతూ బడే బాయ్ తో సఖ్యతగా ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్న ముఖ్యమంత్రి కేంద్రం నుంచి సాధించింది ఏమిటి? తెలంగాణలో పండే పంటల్లో కేంద్రం కొనేది అరకొర మాత్రమే అందులో వడ్లు మూడో వంతు మిగతా పంటలు కేవలం 25 శాతమే రాష్ట్ర సర్కారు ఇంత దారుణంగా చేతులెత్తేస్తే ఇక 70 లక్షల మంది రైతులకు దిక్కెవరో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ఇప్పటికే తెలంగాణలో ఏ రహదారి చూసిన రైతుల ఆందోళనలు నిరసనలతో హోరెత్తుతుంది గత సీజన్లోనే పంటలు కొనకుండా రైతులను కోసపెట్టిన ప్రభుత్వం వచ్చే సీజన్ కు ముందే చేతులెత్తేయడం సిగ్గుచేటు కాడే పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వ సర్కారుకు రైతులు కారు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
కార్యక్రమములో రంగారెడ్డి, మోసిన్ అలీ,
కరుణాకర్ రెడ్డి, దుర్గంపూడి నారాయణ రెడ్డి, పాలుట్ల బాబయ్య, బైరం సంపత్, మట్టపల్లి సైదులు యాదవ్, కుందూరు వీర కోటిరెడ్డి, ఆంగోతు హాతిరాం నాయక్, చిర్రా మల్లయ్య యాదవ్, మిర్యాల మధుసూదన్ రావు, జరిపోతుల రాములు గౌడ్, ఎండి ఇలియాస్ ఖాన్, తీరంశెట్టి కోటేశ్వరరావు, పెండ్యాల పద్మ, కోదాటి రమ, ధనావతు దసృ నాయక్, పున్నా నాయక్, కంపసాటి మధుసూదన్, పేరాల కృపాకర్ రావు, అమరావతి సైదులు, పోలు నాగార్జున తదితరులు ఉన్నారు.










