Karimnagar : కరీంనగర్ రేకుర్తిలో ఈతకు వెళ్లి 16 ఏళ్ల బాలుడు గల్లంతు.. ముమ్మరంగా గాలింపు..!
కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నగర శివార్లలోని రేకుర్తి బతుకమ్మ చెరువు సమీపంలో ఈత కొట్టడానికి వెళ్లిన ఒక బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు.

Karimnagar : కరీంనగర్ రేకుర్తిలో ఈతకు వెళ్లి 16 ఏళ్ల బాలుడు గల్లంతు.. ముమ్మరంగా గాలింపు..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నగర శివార్లలోని రేకుర్తి బతుకమ్మ చెరువు సమీపంలో ఈత కొట్టడానికి వెళ్లిన ఒక బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేకుర్తి పరిధిలోని స్వామి కాలనీకి చెందిన షాకీర్ ఖాన్ (16) (తండ్రి ఆజిమ్ ఖాన్) అనే బాలుడు శనివారం సాయంత్రం సరదాగా ఈత కొట్టేందుకు బతుకమ్మ చెరువు సమీపంలోని ఒక బావిలోకి దిగాడు.
అయితే నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ఆ బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. షాకీర్ ఖాన్ నీటిపైకి రాకపోవడాన్ని గమనించిన తోటివారు వెంటనే ఆందోళనతో చుట్టుపక్కల వారికి మరియు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని బావిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం బాలుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనతో స్వామి కాలనీలో తీవ్ర శోకసంద్రం నెలకొంది.










