Miryalaguda : ఆ ఏడు రకాల వరి విత్తనాలనే రైతులకు విక్రయించాలి..!
మిర్యాలగూడ మండలంలోని విత్తన డీలర్లతో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కె. జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

Miryalaguda : ఆ ఏడు రకాల వరి విత్తనాలనే రైతులకు విక్రయించాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ మండలంలోని విత్తన డీలర్లతో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కె. జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నోటిఫై చేసిన వరి 7 రకాల విత్తనాలను ( బీపీటీ 5204, HMT సోనా , జై శ్రీ రామ్ , KNM1638, కేఎన్ఎం 7715, WGL44, ఆర్ ఎన్ ఆర్ 15048) మాత్రమే రైతులకు పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు. అలాగే రైతులకు పంపిణీ చేసిన ప్రతి విత్తన వివరాన్ని తప్పనిసరిగా ఆన్‌లైన్ సీడ్ ఎంట్రీ చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి రుషేంద్ర మణి, వ్యవసాయ విస్తరణ అధికారులు రమేష్, పార్వతి, నాగయ్య, అఫ్రీన్, గోపి మరియు మండలంలోని విత్తన డీలర్లు అశోక్ రెడ్డి, శ్రీనివాస్, వాసు, శేఖర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- Gold Price : ఒకేసారి పడిపోయిన గోల్డ్ ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
- రైతులు ఈ పంటలు సాగు చేస్తే నాలుగేళ్ళ పాటు ఏటా ఎకరానికి రూ.4200 ప్రభుత్వ సహాయం.. 30 ఏళ్ల పాటు స్థిరాదాయం..!
- Miryalaguda : ఎరువుల దుకాణదారులకు వ్యవసాధికారిణి సీరియస్ హెచ్చరిక.. దుకాణాలు ఆకస్మిక తనిఖీ..!
- WhatsApp : వాట్సాప్ ఇక నుంచి ఫ్రీ కాదు.. నెలకు రూ. 79 చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసుకుందాం..!









