Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Urea Booking : రైతులకు శుభవార్త.. యూరియా బుకింగ్ ఇక ఈజీ.. యాప్ లో మార్పులు చేసిన వ్యవసాయ శాఖ..!

రైతులకు యూరియా కష్టాల నుంచి తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి శుభవార్త తెలిపింది. యూరియా కోసం రైతులు ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే యాప్ ను ఇక సులభతరం చేసింది.

Urea Booking : రైతులకు శుభవార్త.. యూరియా బుకింగ్ ఇక ఈజీ.. యాప్ లో మార్పులు చేసిన వ్యవసాయ శాఖ..!

మిర్యాలగూడ, మన సాక్షి:

రైతులకు యూరియా కష్టాల నుంచి తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి శుభవార్త తెలిపింది. యూరియా కోసం రైతులు ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే యాప్ ను ఇక సులభతరం చేసింది. దాంతో రైతులకు యూరియా కష్టాలు తీరనున్నాయి. ముందుగా యూరియా యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో (వెర్షన్ 1.0.12) ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకోవాలి. పట్టాదారు పాసుబుక్ తో లింకు అయిన ఫోన్ నెంబర్ తో యాప్ తో లాగిన్ కావాలి. ఆ తర్వాత సాగు వివరాలను యాప్ లో నమోదు చేయాలి. గతంలో మాదిరిగా కాకుండా కొత్తగా యూరియా బస్తాల బుకింగ్ విధానంలో వ్యవసాయ శాఖ మార్పులు చేసింది.

రెండు ఎకరాల వరకు సాగు చేసే రైతులు యాప్ లో ఒకేసారి బుకింగ్ చేసి నాలుగు యూరియా బస్తాలను తీసుకుని వెసులుబాటును కల్పించారు. యూరియా బుకింగ్ యాప్ లో మార్పులు జరిగాయని రెండేకరాల పంటకు సరి పోయే యూరియా ఒకే సారి చేసుకోవచును. 2 నుండి 5 ఎకరాలున్న రైతులు రెండు దఫాలుగా బుకింగ్ చేసుకోవాలి, 5 ఎకరాలకు పైగా ఉన్న రైతులు ముందు 40శాతం, రెండోసారి 30 శాతం, మూడో సారి 30శాతం బుక్ చేసుకోవాలని మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారిని రుశేంద్రమణి తెలిపారు.

క్లిక్ చేసి ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు