Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Pocso Case : నల్గొండ జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. అరెస్ట్..!

నల్గొండ జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ పోక్సో కేసు నమోదైన ఘటన గుర్రంపోడు లో చోటుచేసుకుంది. గుర్రంపోడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణను ఫోక్సో కేసు కింద నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు.

Pocso Case : నల్గొండ జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. అరెస్ట్..!

మన సాక్షి, గుర్రంపోడు :

నల్గొండ జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ పోక్సో కేసు నమోదైన ఘటన గుర్రంపోడు లో చోటుచేసుకుంది. గుర్రంపోడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణను ఫోక్సో కేసు కింద నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల ప్రకారం.. ఇటీవల సైకిల్ పై వెళ్తున్న ఓ బాలికను నిందితుడు అడ్డగించి ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. అనుచిత విధంగా ఆమెను తాకి వేధించారు. ఇంటికి వెళ్ళాక బాలిక ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో వారు వెంటనే నల్గొండ వన్ టౌన్ పోలీస్ లను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఘటనా స్థలంలో ని సీసీటీవీ ని పరిశీలించారు.

మాస్క్ తో తిరిగినట్లు గుర్తించారు. గుర్రంపోడు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సత్యనారాయణ గుర్తించారు. దాంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా నకిరేకల్ లో పనిచేస్తున్న సమయంలో ఇద్దరు బాలికలను వేధించడం వల్ల రెండు సార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు సమాచారం.

ఇవి కూడ చదవండి : 

మరిన్ని వార్తలు