Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో హోరెత్తిన కాంగ్రెస్ నిరసన.. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం..!

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.

Miryalaguda : మిర్యాలగూడలో హోరెత్తిన కాంగ్రెస్ నిరసన.. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి నాయకత్వంలో సుమారు 1000 మంది విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రాజీవ్ చౌక్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.

ర్యాలీ అనంతరం రాజీవ్ చౌక్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని, ప్రతిపక్షాల గొంతును అణిచివేసే ప్రయత్నం చేస్తోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని తీవ్రంగా విమర్శించారు. ప్రజల హక్కులు, సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని అన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని, ఆ హక్కును హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని, వెంటనే కాంగ్రెస్ నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని నిర్బంధాల నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ప్రజా ఆందోళనలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుకూరి బాలు, నూకల వేణుగోపాల్ రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, గాయం ఉపేందర్ రెడ్డి, స్కైలాబ్ నాయక్, పొదిల శ్రీనివాస్, దేశిడి శేఖర్ రెడ్డి, జానకి రాంరెడ్డి, తలకొప్పుల సైదులు, బంటు లక్ష్మీనారాయణ, మేడ సురేందర్ రెడ్డి, చల్ల అంజిరెడ్డి, పోల గాని వెంకటేష్,  నాగు నాయక్, ఆరిఫ్, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు