Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

Almatti : కదిలిన కృష్ణమ్మ ఆల్మట్టి డ్యాం గేట్ల ఎత్తివేత.. దిగువకు భారీగా వరద..!

కృష్ణమ్మ ఎట్టకేలకు కదిలింది. కర్ణాటక రాష్ట్రం దాటి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవహిస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులలో నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరాయి.

Almatti : కదిలిన కృష్ణమ్మ ఆల్మట్టి డ్యాం గేట్ల ఎత్తివేత.. దిగువకు భారీగా వరద..!

మన సాక్షి తెలంగాణ బ్యూరో :

కృష్ణమ్మ ఎట్టకేలకు కదిలింది. కర్ణాటక రాష్ట్రం దాటి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవహిస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులలో నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరాయి. దాంతో శనివారం ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గేట్ల ద్వార, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు వరద నీరు రానున్నది.

మహారాష్ట్ర లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి డ్యామ్ లోకి 88,228 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దాంతో ఆల్మట్టి డ్యాం 112.43 టీఎంసీలకు చేరింది. కాగా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తి 25వేల క్యూసెక్కుల నీటిని, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 42,500 క్యూసెక్కుల నీటిని మొత్తంగా 67,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో నారాయణపూర్ ప్రాజెక్టు లోకి 66,692 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దాంతో నారాయణపూర్ ప్రాజెక్టు కూడా గరిష్ట స్థాయికి చేరుకోవడంతో నారాయణపూర్ డాం గేట్లు ఎత్తి 15,278 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి ద్వారా 6000 క్యూసెక్కుల నీటిని మొత్తంగా 21 278 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

అయితే ఈ ప్రవాహం సోమవారం నాటికి జూరాల ప్రాజెక్టుకు చేరుకోనున్నది. అయితే ఇదే ప్రవాహం కొనసాగితే జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం కు ఆగస్టు మాసం ప్రారంభంలోనే వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు చేరితే ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీరు వచ్చినట్లే. ఇదే విధంగా వరద ప్రవాహం కొనసాగితే ఆగస్టు రెండవ వారంలోనే నాగార్జున సాగర్ లోకి కూడా వరద ప్రవాహం చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

MOST READ :

మరిన్ని వార్తలు