Narayanpet : జిల్లా ఎస్పీ కీలక ప్రకటన.. ఈనెల 31 వరకు జిల్లాలో 30 పోలీస్ యాక్ట్..!
నారాయణపేట జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలగకుండా ఉండే లా జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 31 వరకు భారత పోలీస్ చట్టం-1861లోని సెక్ష న్-30ను అమలు చేస్తు న్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు.

Narayanpet : జిల్లా ఎస్పీ కీలక ప్రకటన.. ఈనెల 31 వరకు జిల్లాలో 30 పోలీస్ యాక్ట్..!
నారాయణపేట టౌన్, మన సాక్షి :
నారాయణపేట జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలగకుండా ఉండే లా జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 31 వరకు భారత పోలీస్ చట్టం-1861లోని సెక్ష న్-30ను అమలు చేస్తు న్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, ప్రజాహితం దృష్ట్యా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ఈ మేరకు ఆగస్టు 31 వరకు జిల్లా వ్యాప్తంగా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపారు.ఈ ఉత్తర్వుల ప్రకారం ముంద స్తు పోలీసు అనుమతి లేకుండా ఎలాంటి రాజకీ య సభలు, ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించ రాదని స్పష్టం చేశారు. అలాగే జిల్లా పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మైక్ లు, లౌడ్‌స్పీకర్లు వినియో గించాలంటే సంబంధిత పోలీసు అధికారుల నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా పండుగ లు, సంప్రదాయ వేడుకలు, ఆచారాలకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణ కోసం కూడా నిర్వాహకులు ముందస్తుగా సంబంధిత పోలీసు అధికారులకు దరఖాస్తు చేసుకుని అను మతి పొందాలని ఎస్పీ తెలిపారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి శాంతి భద్రతల పరిరక్షణకు తోడ్పడాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుం టామని ఎస్పీ హెచ్చరించారు.
MOST READ :
- Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. గేట్లు ఓపెన్ ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!
- Good News : నిరుద్యోగులకు శుభవార్త.. అంగన్వాడి టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!
- Fake Certificate : భార్య సర్టిఫికెట్తో మోసం.. వీఆర్ఏ నుంచి జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం..!
- LPG GAS : బిగ్ రిలీఫ్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..!









