Srisailam : శ్రీశైలంకు పోటెత్తిన వరద.. 2.49 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. లేటెస్ట్ అప్డేట్..!
కృష్ణమ్మ ఉరకలేస్తుంది. జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. ఇక శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జూరాల ప్రాజెక్టు ద్వారా 2,43, 860 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.

Srisailam : శ్రీశైలంకు పోటెత్తిన వరద.. 2.49 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
కృష్ణమ్మ ఉరకలేస్తుంది. జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. ఇక శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జూరాల ప్రాజెక్టు ద్వారా 2,43, 860 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.
శ్రీశైలం జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 867 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను 131.26 టిఎంసిల నీరు చేరింది.
వారం రోజుల గడువు లోనే శ్రీశైలం జలాశయానికి 88 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి జూరాలకు భారీగా వరద నీరు వస్తుంది. దాంతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం కు 2,49,785 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.
ఇది ఇలా ఉండగా శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి 4267 క్యూసెక్కుల నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేశారు. కాగా డ్యాం పూర్తిగా నిండకముందే విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని వదిలేస్తున్నారని సీమ ప్రజలు ఆందోళన చేయడంతో వెంటనే విద్యుత్ ఉత్పత్తిని ఆపేశారు. కేవలం కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కుల నీటిని మాత్రమే తరలిస్తున్నారు.
MOST READ :