Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

Srisailam : కృష్ణమ్మ పరవళ్ళు.. శ్రీశైలంకు భారీ వరద.. ఎన్ని టిఎంసీ చేరిందంటే.. లేటెస్ట్ అప్డేట్..!

కృష్ణా ఎగువ పరివాహక ప్రాంతాలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి వడివడిగా నీరు వచ్చి చేరుతుంది.

Srisailam : కృష్ణమ్మ పరవళ్ళు.. శ్రీశైలంకు భారీ వరద.. ఎన్ని టిఎంసీ చేరిందంటే.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

కృష్ణా ఎగువ పరివాహక ప్రాంతాలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి వడివడిగా నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయంలోకి రెండు లక్షల 25 వేల 91 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. గురువారం రాత్రి వరకు శ్రీశైలం జలాశయంలో 149.062 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం జలాశ పూర్తి నీటిమట్టం 215.810 మరో 66 టీఎంసీల నీరు వస్తే జలాశయం పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది. ప్రస్తుతం 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం కానీ 871.76లకు చేరింది.

ఇదిలా ఉండగా శ్రీశైలం జలాశయం నుంచి తాగునీటి అవసరాలకు రాయలసీమ జిల్లాలకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లెత్తి నీటిని విడుదల చేశారు. తెలుగు గంగ ప్రాజెక్టుకు కూడా నీటిని విడుదల చేశారు. గురువారం సాయంత్రం నాటికి 4000 క్యూసెక్కుల నీళ్లు తెలుగు గంగ కాల్వకు మళ్లించారు. వెలుగోడు నింపిన తర్వాత ఇతర ప్రాంతాలలో తాగునీటి అవసరాలకు మళ్లించనున్నారు.

ఇది ఇలా ఉండగా శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కి 6,589 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం జలాశంలోకి ప్రస్తుతం భారీ ఇన్ఫ్ ఫ్లో కొనసాగుతుంది.

ఆల్మట్టి డ్యాంకు కూడా భారీ వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ఆలమట్టి డ్యామ్ కు ఒక లక్ష ముప్పై మూడు వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా దిగువకు ఒక లక్ష 51 వేల కుసేక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా నారాయణపూర్ ప్రాజెక్టుకు ఒక లక్ష యాభై వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు కాగా 1,52,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మరో నాలుగు రోజుల్లో ఆల్మట్టి డ్యామ్ కు వరద ప్రవాహం తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా నాలుగు రోజుల తర్వాత కూడా మరో 10 రోజుల పాటు ఒక లక్షల నీరు శ్రీశైలం కు వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు