Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయంతెలంగాణవ్యవసాయం

Rythu : రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. రూ.5 లక్షలు తీసుకోండి..!

వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త తెలియజేసింది. రైతులతో పాటు అనుబంధ వృత్తులకు కూడా ప్రోత్సాహం కల్పించే విధంగా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ క్రెడిట్ కార్డు పథకం పరిధిని మరింత విస్తరించింది.

Rythu : రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. రూ.5 లక్షలు తీసుకోండి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త తెలియజేసింది. రైతులతో పాటు అనుబంధ వృత్తులకు కూడా ప్రోత్సాహం కల్పించే విధంగా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ క్రెడిట్ కార్డు పథకం పరిధిని మరింత విస్తరించింది. వ్యవసాయ రంగంతో పాటు పశుపోషణ, మత్స్య పరిశ్రమ, మేకల పెంపకం, పందుల పెంపకం లాంటి రంగాల్లో అర్హులైన రైతులకు పశువుల పాకలకు కూడా ఈ పథకం అందుబాటులో ఉండే విధంగా ప్రకటించింది.

ఈ పథకం ద్వారా వ్యవసాయ లబ్ధిదారులకు తక్కువ వడ్డీకి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం రుణాలను పొందే అవకాశం ఉంటుంది. రైతులు సకాలంలో పెట్టుబడులు పెట్టుకుని ఉత్పత్తిని పెంచుకొని అధిక ఆదాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా అందించే రుణపరిమితిని కేంద్ర ప్రభుత్వం గతంలో మూడు లక్షల రూపాయల ఉండగా ప్రస్తుతం మూడు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పెంచింది.

సాధారణ వడ్డీ శాతం 7 శాతం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మూడు శాతం వడ్డీ రాయితీ అందించడం వల్ల సకాలంలో రుణాలు చెల్లించే రైతులు కేవలం నాలుగు శాతం వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ఈ పథకం దోహదపడుతుంది. ఈ పథకం ద్వారా చిన్న సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకుగాను చిన్న, సన్నకారు రైతులను ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని కేంద్రం పెంచింది.

MOST READ 

మరిన్ని వార్తలు