Nagarjuna Sagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. పెరుగుతున్న నీటిమట్టం..!
నాగార్జునసాగర్ జలాశయానికి భారీ వరద ప్రవాహం వస్తోంది. వస్తున్న వరద ప్రవాహం కూడా క్రమంగా పెరుగుతోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి.

Nagarjuna Sagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. పెరుగుతున్న నీటిమట్టం..!
మన సాక్షి, నాగార్జునసాగర్ :
నాగార్జునసాగర్ జలాశయానికి భారీ వరద ప్రవాహం వస్తోంది. వస్తున్న వరద ప్రవాహం కూడా క్రమంగా పెరుగుతోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల నుంచి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కాగా శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శనివారం ఉదయం తొమ్మిది గంటల సమయానికి నాగార్జునసాగర్ జలాశయానికి 49,983 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయ పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 590 అడుగులకు కాను ప్రస్తుతం 515.30 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను ప్రస్తుతం సాగర్ జలాశయంలో 140.8451 టీఎంసీల నీరు నిలువ ఉన్నది. ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం ఇదే విధంగా కొనసాగితే సాగర్ జలాశయంలో నీటిమట్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
MOST READ
- Srisailam : శ్రీశైలం నిండకముందే ఏపీకి నీటి తరలింపు.. మరి సాగర్ పరిస్థితి..!
- Rythu : రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. రూ.5 లక్షలు తీసుకోండి..!
- Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 న కొత్త రేషన్ కార్డుల పంపిణి..!
- Srisailam : శ్రీశైలం కు పోటెత్తిన వరద.. ఇన్ ఫ్లో 2.16 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!









