Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

Cheyutha : చేయూత కొత్త పింఛన్లు వీరికి రావు..!

తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛన్లను కొత్తగా మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభమైంది కాగా వారిలో దరఖాస్తు అర్హతలను నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం అర్హత ఉన్నవారికి మాత్రమే పింఛన్లు మంజూరు కానున్నాయి.

Cheyutha : చేయూత కొత్త పింఛన్లు వీరికి రావు..!

మనసాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛన్లను కొత్తగా మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభమైంది కాగా వారిలో దరఖాస్తు అర్హతలను నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం అర్హత ఉన్నవారికి మాత్రమే పింఛన్లు మంజూరు కానున్నాయి.

ఇవీ అర్హతలు :

చేయూత పింఛన్లకు అర్హత విషయంలో కుటుంబ వార్షికాదాయాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం 1.50 లక్షల కంటే తక్కువగా ఉండాలి. పట్టణ ప్రాంతాలలో 2 లక్షల రూపాయల కంటే వార్షికాదాయం తక్కువగా ఉండాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ పరిమితి కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు పింఛన్లకు అనర్హులుగా పరిగణిస్తారు. అదేవిధంగా వ్యవసాయ భూమి విషయంలోనూ కూడా పరిమితులను విధించింది. మూడు ఎకరాల కంటే ఎక్కువ మాగాని భూమి, లేదా 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి ఉన్నవారు పింఛన్లకు అర్హులు కాదు.

ALSO READ : Hyderabad : అమ్మాయిలూ.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వల.. జాగ్రత్త.. సీపి సజ్జనార్ హెచ్చరిక..!

ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు, ఉద్యోగులు కూడా అనర్హులుగా పేర్కొన్నది. డాక్టర్లు, కాంట్రాక్టర్లు ఇతర వృత్తిని కూడా పింఛన్ లకు అర్హులు కాదు. అదేవిధంగా ఆయిల్ మిల్లులు,రైస్ మిల్లులు, పెట్రోల్ బంకుల యజమానులు వారి తల్లిదండ్రులను కూడా అనర్హుల జాబితాలోకి చేర్చారు. ప్రభుత్వ, స్వాతంత్ర సమరయోధుల పింఛన్ పొందుతున్న వారికి కొత్తగా చేయిత పించన్ మంజూరు చేయరు. అదే విధంగా నాలుగు చక్రాల వాహనాలు, భారీ వాహనాలు కలిగి ఉన్న వారిని కూడా అనర్హులుగా పరిగణించనున్నారు.

ALSO READ 

మరిన్ని వార్తలు