Miryalaguda : మిర్యాలగూడలో హర్ ఘర్ తిరంగా.. ప్రతి ఇంటా జాతీయ జెండా..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో తిరంగా ర్యాలీ నిర్వహించారు.

Miryalaguda : మిర్యాలగూడలో హర్ ఘర్ తిరంగా.. ప్రతి ఇంటా జాతీయ జెండా..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఫ్లై ఓవర్ నుండి రౌండ్ చౌరస్తా వరకు పట్టణ ప్రజలు విద్యార్థిని విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ విచ్చేసి మాట్లాడుతూ దేశ సమగ్రతకు సార్వభౌమాధికారానికి హాని పెట్టాలని కానీ, విదేశీ సొమ్ముతో ఈ దేశం లో అరాచకం చేయాలని చూసే విచ్ఛిన్న శక్తులు ఎవరైనా సరే వారికి భారత ప్రభుత్వం ఈ దేశ యువత సరైన బుద్ధి చెబుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు బసవరాజు లక్ష్మీ నరసయ్య, బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు, గోలి మధుసూదన్ రెడ్డి, హర్ ఘర్ తిరంగా కార్యక్రమ నల్గొండ జిల్లా ఇన్చార్జ్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మైల నరసింహా,
మిర్యాలగూడ వన్ టౌన్, టూ టౌన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బంటుగిరి, పెద్దబోయిన వెంకటేశ్వర్లు, కొంగరి వెంకటరమణ, మూల రాజిరెడ్డి, శ్రీకాంత్,
సీనియర్ నాయకులు బంటు సైదులు, రేపాల పురుషోత్తం రెడ్డి, ఎడ్ల రమేష్, తుమ్మలపల్లి హనుమంత్ రెడ్డి, కన్మంత్ రెడ్డి అశోక్ రెడ్డి, కొండేటి సరిత, చిలుకూరి రమాదేవి శ్యామ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వెలుగు ఇందిరా నాగరాజ్, చిల్లంచర్ల అభి, బంటు యాదగిరి, గోనె కవిత రెడ్డి, మండల సోములు, మంద శివ, మోదల అశోక్, మునగాల శివ, చిలుకూరి వెంకటేశ్వర్లు, శశి తదితరులు పాల్గొన్నారు.
MOST READ
- Ragi Java : రాగి జావతో ప్రయోజనాలు, ఎవరు తాగొద్దు.. తయారు ఎలా, ఎంత తాగాలో తెలుసుకుందాం..!
- Cheyutha : చేయూత పింఛన్ల దరఖాస్తులకు ఈ నెలాఖరే చివరి తేదీ..!
- Nalgonda : మిర్యాలగూడ ఫోక్సో కేసులో.. నల్గొండ కోర్టు సంచలన తీర్పు..!
- శ్రీశైలంలోకి నిలకడగా వరద, నాగార్జున సాగర్ లోకి 76,416 క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. లేటెస్ట్ అప్డేట్..!











