TS News : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కు భారీ తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి మరో రెండేళ్లు వయోపరిమితిని పెంచుతూ అవకాశం కల్పించింది.

TS News : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కు భారీ తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి మరో రెండేళ్లు వయోపరిమితిని పెంచుతూ అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
పోలీస్ శాఖ, ఫైర్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్ శాఖ, ట్రాన్స్పోర్ట్ శాఖ, ఫారెస్ట్ శాఖలోని ఉద్యోగాలకు ఈ వయోపరిమితి సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటికే ఐదేళ్ల వయోపరిమితి పెంపు 2026 మే 18 వ తేదీ నుంచి అమల్లో ఉంది. అయితే నిరుద్యోగ యువత నుంచి వచ్చిన అనేక వినతుల నేపథ్యంలో ప్రభుత్వం పరిశీలించి తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
దాంతో ఆయా శాఖలోని పోస్టులకు మొత్తం వయోపరిమితి ఏడేళ్ల కు పెంచినట్లు అయింది. ప్రస్తుతం కొనసాగుతున్న పోలీస్ రిక్రూట్మెంట్ ల కూడా ఈ అదనపు వయోపరిమితి పెంపు నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తరంలో స్పష్టంగా పేర్కొన్నది. ప్రభుత్వం నిర్ణయంతో పోలీసు యూనిఫామ్ ఉద్యోగాలకు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ అవకాశం లభించినట్లు అయ్యింది.
ALSO READ :
- Suryapet : సూర్యాపేట జిల్లా వెల్దండలో ఘోరం.. విద్యుత్ షాక్తో కౌలు రైతు మృతి..!
- Suryapet : సూర్యాపేట జిల్లాలో దంపతుల హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు..!
- భర్తను హత్య చేసిన భార్య.. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ..!
- Cyber : ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగానే ఖాతా ఖాళీ.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి..!









