హోటళ్లో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు భక్తులు సజీవ దహనం..!
పశ్చిమ బెంగాల్లోని బిర్ముర్ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం.. తారాపీట్ లో సోమవారం తెల్లవారుజామున భారీ విషాదం జరిగింది.

హోటళ్లో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు భక్తులు సజీవ దహనం..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
పశ్చిమ బెంగాల్లోని బిర్ముర్ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం.. తారాపీట్ లో సోమవారం తెల్లవారుజామున భారీ విషాదం జరిగింది. అక్కడ ఓ హోటల్లో ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెడరేగడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
సోమవారం తెల్లవారు జామున 4:30 గంటల నుంచి 5 గంటల మధ్య సమయంలో హోటల్ గదుల్లో ఉన్న భక్తులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించే లోపే మంటలు వేగంగా వ్యాపించడంతో ఏడుగురు భక్తులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం షార్ట్ సర్కిట్ వల్ల జరిగే ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
MOST READ :
- TS News : సీఎం రేవంత్ రెడ్డి టూర్ కు కొండ దంపతులు దూరం.. సభలో వారికి షాక్ ఇచ్చిన రేవంత్..!
- Hanumakonda : పరకాలకు కోట్ల రూపాయలు.. అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు..!
- Health : అద్దాలు లేకుండా కంటి చూపు మెరుగుపడాలంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..!
- National Flag : ఆగష్టు 15, జనవరి 26న జాతీయ జెండా ఎగురవేయడంలో తేడా ఉంటుందా.. అది ఏంటో తెలుసుకుందాం..!









