Breaking Newsక్రైంజిల్లా వార్తలుమంచిర్యాల జిల్లా
ACB : ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..!
లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు చిక్కింది.

ACB : ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..!
మన సాక్షి, మంచిర్యాల :
లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు చిక్కింది. వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా లింగాయపల్లి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి ఆ గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇంటికి అనుమతి, ఇంటి నెంబర్ కోసం 20000 రూపాయలు డిమాండ్ చేసింది. ఆ తర్వాత బేరం చేసుకున్న వ్యక్తి 13000 ఇచ్చేందుకు అంగీకరించారు.
ఫోన్ పే ద్వారా 13 వేల రూపాయలు చెల్లించాలని ఫిర్యాదారుడికి వరలక్ష్మి సూచించింది. కాగా మరో పంచాయతీ కార్యదర్శి లావణ్య ఫోన్ పే నెంబర్ కు వరలక్ష్మి డబ్బులు బదిలీ చేయించింది. కాగా వరలక్ష్మిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి కరీంనగర్ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు.










