Naka Bandi : తుంగతుర్తిలో నాకాబంది.. 74 ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు సీజ్..!
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పట్టణంలో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి 7:30 గంటల వరకు పట్టణంలోని బీసీ కాలనీ ఎస్సీ కాలనీ తూర్పు వాడ మెయిన్ బజార్ లో నాకా బంది నిర్వహించడం జరిగింది.

Naka Bandi : తుంగతుర్తిలో నాకాబంది.. 74 ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు సీజ్..!
తుంగతుర్తి, ఆగష్టు 22, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పట్టణంలో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి 7:30 గంటల వరకు పట్టణంలోని బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, తూర్పు వాడ, మెయిన్ బజార్ లో పోలీసులు నాకా బంది నిర్వహించడం జరిగింది. ఇండ్లలో ఉన్న వాహనాలకు లైసెన్సులు లేని 74 వాహనాలను, రెండు ఆటో లను ఎలాంటి లైసెన్సు కాగితాలు లేని వాహనాలను పట్టుకొని కేసు నమోదు చేసుకుని వాహనాలను సీజ్ చేయడం జరిగిందని సీఐ నాగేశ్వరరావు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ తుంగతుర్తి మద్దిరాల నూతనకల్ అరవ పెళ్లి మండలాల ఎస్ఐలతో పాటు ఏఎస్ఐలు జమిందార్లు పోలీస్ సిబ్బంది మొత్తం గ్రామంలోని పలు వీధులలో వాహనాల లైసెన్సుల తనిఖీని జల్లడబడుతూ గ్రామంలోని మెయిన్ వీధులలోని ఇండ్లలో ప్రజలు వాడుతున్న వాహనాలను తనిఖీ చేస్తూ శనివారం ఉదయం నాలుగు గంటల నుండి 7:30 గంటల వరకు వాహనాలను పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ మద్దిరాల ఎస్సై వీరన్న నూతనకల్ ఎస్సై నాగరాజు అరవపల్లి ఎస్సై మధు తిరుమలగిరి ఎస్సై వెంకట్ రెడ్డి పలు మండలాల పోలీస్ బృందాలు భారీగా చేరి గ్రామంలో గార్డెన్ సెర్చ్ చేయడం జరిగిందన్నారు.









