Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్ తో రైతు మృతి..!

సాగు చేస్తున్న పంట పొలం కు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురంలో శుక్రవారం జరిగింది.

Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్ తో రైతు మృతి..!

అర్వపల్లి, మన సాక్షి :

సాగు చేస్తున్న పంట పొలం కు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురంలో శుక్రవారం జరిగింది. స్థానిక ఎస్సై మధు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

తిమ్మాపురం గ్రామానికి చెందిన షేక్ రెహమాన్ 53 సంవత్సరాలు, ఇతను సాగు చేస్తున్న వ్యవసాయ భూమి లోని వరి పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్ళగా మోటార్ పనిచేయకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్లి పరిశీలిస్తున్న సమయంలో ఎర్త్ వైరు కాలుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

కొంత సమయం తర్వాత సమీప రైతులు గమనించి కుటుంబ సభ్యులకు తెలియజేసి వెళ్లి చూడగా విద్యుత్ షాక్ తో మరణించినట్లు తెలిపారు. మృతుని కుమారుడు షేక్ అన్వర్ పాషా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

MOST READ

మరిన్ని వార్తలు