PDS : అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత..!

PDS : అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత..!
హన్వాడ, మన సాక్షి:
అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ డిటి కి అప్పజెప్పినట్లు హన్వాడ మండల బిజెపి అధ్యక్షులు కొండ లింగం తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని ఓ రేషన్ డీలర్ దాసరి రాజేష్ గురువారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో అక్రమంగా అదే గ్రామానికి చెందిన బొలెరో వాహనంలో దాదాపు 20 క్వింటాల రేషన్ బియ్యాన్ని అమ్మడానికి లోడ్ చేస్తుండగా స్థానిక గ్రామస్తులు పట్టుకొని ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్ప చెప్పినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హన్వాడ మండల బిజెపి నాయకులు కొండ బుచ్చిరెడ్డి, డాక్టర్ వెంకటయ్య, శ్రీనివాస్ గౌడ్, జుక్యా నాయక్, శివప్రసాద్ గౌడ్ స్పందించి సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు స్పందించి డీలర్ పై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
- TG News : అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు.. కొండ సురేఖకు వ్యతిరేకంగా సమావేశమైన 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..!
- ఏకాంతంగా ఉండేందుకు అడవికి వెళ్ళిన జంట.. చివరికి ఏం జరిగిందంటే..!
- సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!
- Viral : అన్నయ్య అనే పిలుపు కోసం ఎదురుచూస్తున్న బ్రహ్మానందం తోబుట్టు..!








