Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

Suryapet : తీసుకునేది ఎక్కువ ధర.. బిల్లులో తక్కువ ధర.. సూర్యాపేట జిల్లాలో యాదేచ్చగా యూరియా విక్రయాలు..!

తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండల పరిధిలోఎల్ నినో వర్షాభావ ప్రభావంతో ఈ సంవత్సరం వ్యవసాయం ముఖ్యంగా వరి సాగు చేయడం దాదాపుగా సగానికి పడిపోయింది.

Suryapet : తీసుకునేది ఎక్కువ ధర.. బిల్లులో తక్కువ ధర.. సూర్యాపేట జిల్లాలో యాదేచ్చగా యూరియా విక్రయాలు..!

అధికారుల పర్యవేక్షణ కరువు

ఫెర్టిలైజర్ అండ్ ఫెస్టిసైడ్స్ షాప్ యజమానుల ఇస్టారాజ్యం

 ఒక బస్తాకి దాదాపు 40 రూపాయల అధిక వసూల్

తుంగతుర్తి, మన సాక్షి :

తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండల పరిధిలోఎల్ నినో వర్షాభావ ప్రభావంతో ఈ సంవత్సరం వ్యవసాయం ముఖ్యంగా వరి సాగు చేయడం దాదాపుగా సగానికి పడిపోయింది. అధికారుల సూచన మేరకు రైతాంగం ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపరు. నీరు పారుదల గల భూముల్లో వరి సాగు చేసిన రైతులు వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ లో యూరియా బస్తాలు బుక్ చేసినప్పటికీ ఫర్టిలైజర్ షాప్ యజమానుల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది.

మండలంలోని ఒక రైతు యూరియా బుకింగ్ యాప్లో రెండు బస్తాలు బుకింగ్ చేయగా మండల కేంద్రంలో గల రైతు ఆగ్రోస్ సేవా కేంద్రం లో రెండు బస్తాలకి బిల్ 534 రాసి ఆన్లైన్లో లో ఫోన్ పే ద్వారా 600 రూపాయలు వసూలు చేసారు.ఇదేంటని ప్రశ్నించగా మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి. ఇదే విధంగా అమ్ముతామని ధిక్కారస్వరంతో ఎవరికీ చెప్తారో చెప్పుకోండి అని సమాధానం ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు.ఒక షాప్ కి 2,3 లారీల యూరియా వస్తే దాదాపు ఒక లారీ 400 బస్తాలకి 20000, 25000వేల రూపాయలు అధికంగా రైతుల వద్ద తీసుకుంటున్నారు.

మండలంలోని పలు ఫెర్టిలైజర్ షాప్ యజమానులు రైతుల వద్ద అధిక ధరలు వసూలు చేస్తూ బిల్ చిట్టి లో ఒక విధంగా బిల్లు రాసి ఆన్లైన్ పేమెంట్ మరియు నగదు రూపంలో అధిక ధరలకు తీసుకుంటు రైతన్నను నట్టేట ముంచుతున్నారు అని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం యూరియా అమ్మకాల్లో అక్రమాలను అడ్డుకునేందుకు బుకింగ్ యాప్ తెచ్చినప్పటి ఉపయోగం లేకుండా పోయింది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుకింగ్ కొరకు యాప్ పెట్టినా అధిక ధరలు వసూల్ చేస్తు రైతులను ముంచుతున్న ఫర్టిలైజర్ షాప్ యజమానులపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మండల రైతులు వాపోతున్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు