హాస్పిటల్ లో భారీ అగ్ని ప్రమాదం.. 15 మంది శిశువులు సజీవ దహనం..!
హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 15 మంది నవజాత శిశువులు మృతి చెందిన ఘటన పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాదులో ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.

హాస్పిటల్ లో భారీ అగ్ని ప్రమాదం.. 15 మంది శిశువులు సజీవ దహనం..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 15 మంది నవజాత శిశువులు మృతి చెందిన ఘటన పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాదులో ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. హస్పటల్లోని గైనకాలజీ అండ్ వెటర్నరీ చైల్డ్ కేర్ విభాగానికి చెందిన నియోనాటల్ నర్సరీ వార్డులో అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఎయిర్ కండిషనర్ (ఏసీ) పేలడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే గది అంతట మంటలు దట్టమైన పొగ వ్యాపించి చికిత్స పొందుతున్న 15 మంది చిన్నారులు ఊపిరాడక మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ వార్డులో 16 మంది శిష్యులు ఉండగా కేవలం ఒకే ఒక్క శిశువు ను మాత్రమే సురక్షితంగా రక్షించగలిగారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. పుట్టిన కొద్ది క్షణాలకే పసికందులు మృతి చెందడంతో బాధిత తల్లిదండ్రులు, బంధువుల రోదనలలో ఆసుపత్రి ఆవరణ మిన్నంటాయి . ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తేల్చేందుకు ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
MOST READ









