Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ.. అనంతరం కొండా మురళి కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాలపై భట్టి విక్రమార్కతో చర్చించినట్లు సమాచారం. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ.. అనంతరం కొండా మురళి కీలక వ్యాఖ్యలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాలపై భట్టి విక్రమార్కతో చర్చించినట్లు సమాచారం. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండ సురేఖ దంపతుల కూతురు సుస్మిత ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేసిన విషయం విధితమే.

ఆ తర్వాత కొండ సురేఖను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యేలు సైతం ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. బహిరంగంగా సమావేశం పెట్టి పిసిసికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగిసిన వెంటనే కొండ సురేఖ పై చర్యలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ కొండ సురేఖ వ్యవహారం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీ ఏఐసీసీకి కొండా సురేఖ పై నివేదిక అందజేసినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కూతురు సుస్మిత వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కొండ మురళి భేటీ అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన కూతురు వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పట్ల తమకు విశ్వాసం ఉందని తెలిపారు. కూతురు తమ కుటుంబ సభ్యురాలు అయినప్పటికీ ఆమె వ్యాఖ్యలు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు