Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం
BIG BREAKING : చిలుకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది మృతి..!
ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు మంది అక్కడికక్కడే మృతి చెందారు.

BIG BREAKING : చిలుకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు మంది అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలో 15 మంది ప్రయాణిస్తున్నారు. కాగా ఏడుగురు మృతి చెందగా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. బాపట్ల జిల్లా కొండమంజులూరులో పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
MOST READ










