Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
గుర్రంపోడు మండలంలో వ్యక్తి ఆత్మహత్య..!
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలోని పిట్టలగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.

గుర్రంపోడు మండలంలో వ్యక్తి ఆత్మహత్య..!
గుర్రంపోడు, మన సాక్షి :
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలోని పిట్టలగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.
స్థానిక ఎస్సై వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన బైరి యాదగిరి (43), తండ్రి సత్తయ్య, ముదిరాజ్ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. యాదగిరి గత పది సంవత్సరాల నుండి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.
ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉండి తన అనారోగ్యం గురించి ఆలోచిస్తూ యాదగిరి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తమ్ముడు బైరి కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్రంపోడు ఎస్సై వెంకన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి
- శక్తి స్కీమ్ రద్దుకై పోస్ట్‌కార్డుల ఉద్యమం.. సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాసిన విద్యార్థులు
- భూ భారతి చట్టం ద్వార వివాద రహిత భూములన్నింటికీ పట్టాదారు పాసు పుస్తకాలు..!
- డిజిటల్ క్రాప్ సర్వేతో పక్కాగా లెక్క.. రైతు భరోసాకు ఇదే ఫైనల్..?
- Boxing : బాక్సింగ్ పోటీల్లో సెయింట్ జాన్స్ హై స్కూల్ విద్యార్థినికి రజత పతకం..!









