కరీంనగర్ సిపి కీలక ఆదేశాలు.. కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌పై ఆకస్మిక తనిఖీ.!
కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా స్టేషన్‌కు చేరుకున్న ఆయన.. పోలీస్‌స్టేషన్‌లోని వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు.

కరీంనగర్ సిపి కీలక ఆదేశాలు.. కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌పై ఆకస్మిక తనిఖీ.!
కరీంనగర్ బ్యూరో, మనసాక్షి :
కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా స్టేషన్‌కు చేరుకున్న ఆయన.. పోలీస్‌స్టేషన్‌లోని వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధులు, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. పోలీస్‌స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను సీపీ క్షుణ్ణంగా పరిశీలించారు.
కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలు, ఇతర పోలీస్ రికార్డుల నిర్వహణ తీరును పరిశీలించినట్లు తెలిపారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించడంతో పాటు కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. ప్రస్తుత పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారిందని సీపీ పేర్కొన్నారు. నేర పరిశోధన, కేసుల దర్యాప్తు, రోజువారీ పోలీసింగ్‌లో సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్ష్య, సమన్వయ తదితర సాంకేతిక వేదికలు, అనువర్తనాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
ALSO READ : ఈ దొంగ మామూలోడు కాదు.. వెరీ కాస్ట్ లీ, కారులో వస్తాడు.. ఇల్లు గుల్ల చేస్తాడు..!
ఆయా సాంకేతిక వేదికల పనితీరును సిబ్బందితో సమీక్షించారు. పోలీస్‌స్టేషన్‌కు సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సీపీ ఆదేశించారు. ఫిర్యాదులను స్వీకరించే సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, వారి సమస్యలను నిబంధనల మేరకు సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రిసెప్షన్ కౌంటర్ పనితీరుతో పాటు పౌరుల అభిప్రాయాల వివరాలను కూడా పరిశీలించారు.
ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని గౌష్ ఆలం సూచించారు. ప్రజలకు భద్రతపై నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని, నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించినట్లు తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీలో ఇన్‌స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, ఎస్సై సాంబమూర్తితో పాటు పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.









